రెండు సార్లు అధికారమిస్తే.. ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నారు: రేవంత్‌రెడ్డి

TRINETHRAM NEWSTrinethram News : మహదేవపూర్‌: కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టినా లక్ష ఎకరాలకు కూడా నీరు అందలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.. మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న ఏడో బ్లాక్‌లోని..

TRINETHRAM NEWS

Trinethram News : మహదేవపూర్‌: కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టినా లక్ష ఎకరాలకు కూడా నీరు అందలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు..

మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న ఏడో బ్లాక్‌లోని పియర్స్‌ను మంగళవారం సాయంత్రం ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించింది. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు స్థితిగతులపై ఇన్‌ఛార్జి చీఫ్‌ ఇంజినీర్‌ సుధాకర్‌రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. గతేడాది అక్టోబరు 21న మేడిగడ్డ పిల్లర్లు కుంగాయని ఇంజినీర్లు వివరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. లక్ష ఎకరాలకు నీరు అందక పోయినా.. కేసీఆర్‌ మాత్రం కోటి ఎకరాలకు నీరు ఇచ్చామని గొప్పలు చెప్పారని విమర్శించారు. నిర్మాణంలో నాణ్యతాలోపం ఉందని డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ చెప్పినప్పటికీ.. సమస్యను చక్కదిద్దే పని చేయకుండా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏటా విద్యుత్‌ బిల్లులే రూ.10,500 కోట్లు వస్తున్నాయని తెలిపారు. ప్రాజెక్టు రుణాలు, ఇతర ఖర్చులు కలిపి ఏటా రూ.25వేల కోట్లు అవసరమవుతాయని వివరించారు..

మేడిగడ్డను ఎవరూ చూడకుండా కేసీఆర్‌ కప్పిపుచ్చారు..

”కుంగిన మేడిగడ్డను ఎవరూ చూడకుండా కేసీఆర్‌ కప్పిపుచ్చారు. ఈసీ అనుమతి పొంది రాహుల్‌ గాంధీ, నేను మేడిగడ్డను పరిశీలించాం. జరిగిన అవకతవకలపై నీటిపారుదల శాఖ మంత్రి విచారణకు ఆదేశించారు. కాళేశ్వరం నిర్మాణం, నిర్వహణలో భారీగా లోపాలు ఉన్నాయని విజిలెన్స్‌ కమిటీ చెప్పింది. రీడిజైన్‌ పేరుతో కాళేశ్వరం చేపట్టి భారీగా అవినీతికి పాల్పడ్డారు. తన బండారం బయటపడుతుందని కేసీఆర్‌ గ్రహించారు. అవినీతి బయటపడకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకే నల్గొండలో సభ పెట్టారు. చావు నోట్లో తల పెట్టానని కేసీఆర్‌ పదే పదే అంటున్నారు. అలా అని భావించే ప్రజలు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. ప్రజలు రెండుసార్లు అవకాశం ఇస్తే.. ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నారు..

కాళేశ్వరంపై ప్రజల అనుమానాలు నివృత్తిచేయాలని ప్రభుత్వం భావించింది. శాసనసభ, ప్రజా కోర్టులో చర్చిద్దామని ఆహ్వానించాం. కాలు విరిగిందని శాసనసభకు రాలేని కేసీఆర్‌.. నల్గొండ సభకు ఎలా వెళ్లారు. కేసీఆర్‌ దోపిడీకి కాళేశ్వరం బలైపోయింది. అడిగితే సలహాలు ఇస్తానన్న కేసీఆర్‌ ..కేఆర్‌ఎంబీపై చర్చ పెడితే అసెంబ్లీకి ఎందుకు రాలేదు. సభలో చేసిన తీర్మానం చక్కగా లేదని విమర్శిస్తున్నారు. అలాంటి తీర్మానానికి హరీశ్‌రావు ఎందుకు మద్దతిచ్చారు. ఆయన మాటలకు విలువ లేదా? కేసీఆర్‌ బెదిరించి బతకాలని చూస్తున్నారు. సీఎం కుర్చీ పోగానే.. నీళ్లు, ఫ్లోరైడ్‌ బాధితులు గుర్తొచ్చారా? కాలు విరిగందని సాను భూతితో ఓట్లు పొందాలని చూస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వచ్చేందుకు కేసీఆర్‌ ఎందుకు భయపడుతున్నారు. రూ.వేల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు కుంగితే చిన్న విషయంగా మాట్లాడుతున్నారు. ఏముంది చిన్న పిల్లర్లు కుంగాయని తేలికగా మాట్లాడుతున్నారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించింది కేసీఆరే. ప్రాజెక్టులను కేంద్రం నిర్వహించేందుకు గత ప్రభుత్వం నిధులు కూడా ఇచ్చింది. సాగునీటి శాఖపై అసెంబ్లీలో శ్వేతపత్రం పెడతాం.. కేసీఆర్‌ వచ్చి మాట్లాడాలి. ప్రజల కోసం బయటికి వెళ్లే అలవాటు కేసీఆర్‌కు ఏనాడూ లేదు. ఎంపీ ఎన్నికల్లో కొన్ని ఓట్లు తెచ్చుకునేందుకు కొత్త ఎత్తుగడ ఎత్తుకున్నారు” అని రేవంత్‌రెడ్డి విమర్శించారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వరారవుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నేతలు ప్రాజెక్టును పరిశీలించిన వారిలో ఉన్నారు..

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You cannot copy content of this page