మేడిగడ్డ బ్యారేజీని మంగళవారం సాయంత్రం ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించింది

TRINETHRAM NEWS

మహదేవపూర్‌: మేడిగడ్డ బ్యారేజీని మంగళవారం సాయంత్రం ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వరారవుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నేతలు.. ప్రాజెక్టు దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించారు. భారాస, భాజపా సభ్యులు ఈ పర్యటనకు దూరంగా ఉన్నారు. ఉదయం అసెంబ్లీ  నుంచి బస్సులో బయలుదేరిన ప్రజాప్రతినిధులు  సాయంత్రం 3గంటలకు మేడిగడ్డ చేరుకున్నారు. ప్రధానంగా బ్యారేజీలో దెబ్బతిన్న ఏడో బ్లాక్‌లోని పియర్స్‌ను పరిశీలించారు.

You cannot copy content of this page

Scroll to Top