జై భీమ్ – జై జై బాబా సాహెబ్ అంబేడ్కర్

TRINETHRAM NEWS

Trinethram News : ఏలూరు జిల్లా: చింతలపూడి నియోజకవర్గం.

జగన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటినుండి దళితులపై ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ రోజు రాజమహేంద్రవరం లోని వేమగిరి లో మాజీ ఎంపీ హర్ష కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న దళిత సింహగర్జన కు వెళ్తూ దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసే అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ ను ఆయన స్వగృహంలో కలిసి సంపూర్ణ మద్దతు తెలియజేసిన ఏపి రాష్ట్ర దళిత నాయకులు.

రాష్ట్ర దళిత నాయకులు బోడ అనీష్ కుమార్ మాట్లాడుతూ
ఇది దళిత ఆత్మగౌరవ సభ అనీ ,ఆత్మాభిమానం కోసం పెట్టిన సభ అనీ ,జగన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో దళితులకు ఎన్నో మాయమాటలు చెప్పి ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చాడని అన్నారు.రాబోయే రోజుల్లో దళితులు తమ సత్తా చూపించాలని,ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం దళితులకు తీసేసిన సంక్షేమ పథకాలన్నీ సాధించేవరకు పోరాడాలని దళితులకు అనీష్ పిలుపునిచ్చారు.

రాష్ట్ర దళిత నాయకులు డా. మారుమూడి థామస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటి నుండి ఈరోజు వరకు దళితులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం ఆపేయడమే కాకుండా, వారి మీద అక్రమ కేసులు పెట్టడం, ఆర్థికంగా అణచివేయడం చిత్రహింసలకు గురి చేయడమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడని రాబోయే రోజుల్లో దళితులంతా ఏకమై జగన్ రెడ్డిని గద్దె దించి తగిన బుద్ధి చెప్తారని థామస్ అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా దళిత నాయకులు బొకినాల వాసు, టోకూరి ఏబు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top