WhatsApp Image 2024 02 10 at 21.00.21
Trinethram News : చిన్నపిల్లలను అపహరించే ముఠా నగరంలో ప్రవేశించిందని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మవద్దని హనుమకొండ ఏసీపీ వెల్లడించారు. ఈ మేరకు ఏసీపీ కమిషనర్ కార్యాలయం నుంచి శనివారం ప్రకటన విడుదల చేశారు. పిల్లలను ఆపహరించేందుకు ఎలాంటి ముఠాలు నగరంలోకి రాలేదని, అసత్యప్రచారాలు నమ్మవద్దన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసు యంత్రాంగం పటిష్టమైన నిఘాతో బందోబస్తు నిర్వహిస్తున్నారన్నారు.. సామాజిక మాధ్యమాల్లో అసత్యాలు ప్రచారం చేయటం సరికాదన్నారు. అనుమానా స్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100, పోలీసు కంట్రోల్ రూమ్ 8712 685070నెంబరుకు సమాచారం అందించాలన్నారు.
