జూన్ 27, 2026

WhatsApp Image 2024 02 10 at 14.17.49

TRINETHRAM NEWS

కృష్ణాజిల్లా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి పిల్లల విభాగంలో మొత్తం 15 మంది వైద్యం పొందుతున్నారు. వైద్యం పొందుతున్న చిన్నారులకు రోజుమాదిరిగానే ఇంజక్షన్ చేశారు. ఇంజక్షన్ చేసిన అరగంటకు విపరీతమైన చలి, జ్వరం రావడం గమనించి డాక్టర్లు అప్రమత్తం అయ్యారు.

ఇంజక్షన్ చేసిన వారిలో 7గురు పిల్లలకు అస్వస్థత గా ఉండడంతో వారిని ఇంటెన్సివ్ కేర్ కు తరలించి వైద్యం అందిస్తున్నారు.

అస్వస్థతకు గురయిన చిన్నారులు అయాన్ షి 1 సంవత్సరం, యోషిత నాగ మణికంఠ 1 సంవత్సరం, మొహమ్మద్ రేహాన్ 6 సంవత్సరాలు, గాయత్రి 8 నెలలు, వర్షిత కృష్ణ 8 సంవత్సరాలు, పార్ధు 14 నెలలు.

ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉంది అని వైద్యులు చెప్పుచున్నారు.

You cannot copy content of this page