WhatsApp Image 2024 02 09 at 12.40.49
Trinethram News : అన్నమయ్య జిల్లా మదనపల్లె
మదనపల్లె-కర్ణాటక బార్డర్ మాలెపాడు దొనబైలు అడవిలో చంపి పాతిపెట్టిన శ్రీనివాసులు మృతదేహాన్ని పోలీసులు నేడు బయటకు తీసి అక్కడే పోస్ట్ మార్టం చేయనున్నారు. చీకలబైలుకు చెందిన శ్రీనివాసులు గత నెల 28న అదృశ్య మయ్యాడు. అతడిని మండలంలోని మాలెపాడు దొనబైలుకు చెందిన ప్రసాద్ హత్య చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, మృత దేహాన్ని కర్ణాటక బార్డర్‌లోని అడవిలో పాతినట్లు గురువారమే తెలుసుకున్నారు. శ్రీనివాసులు మృతదేహాన్ని శుక్రవారం తాలూకా సీఐ ఎన్ శేఖర్, టూ టౌన్ సీఐ యువరాజు లు సిబ్బందితో కలసి వెళ్లి వైద్యులతో స్పాట్ పిఎం చేయించ నున్నారు….
