నవంబర్ 26, 2026
TRINETHRAM NEWS
Awareness on Prevention

Awareness on Prevention : అరకులోయ నవంబర్ 27, (త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు వేలి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠశాల, కంటబసుగూడలో సెంట్రల్ హెల్త్ టీం సందర్శన సందర్భంగా ఐసిడిఎస్ సీడీపీఓ, డీసీపీయూ, చైల్డ్‌లైన్ సిబ్బంది బాలికలకు బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలు, వాటి నివారణ చర్యలు, బాల్యవివాహాల నిరోధక ప్రతిజ్ఞపై అవగాహన కల్పించారు. చట్టబద్ధమైన దత్తత ప్రక్రియ, దత్తత ప్రాముఖ్యతతో పాటు చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 సేవలను వివరించారు.
అనంతరం అరకు వ్యాలీ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన సెక్టార్ సమావేశంలో అంగన్వాడీ కార్యకర్తలకు దత్తత విధానం, శిశుగృహ సేవలు, పిల్లల సంరక్షణ, రక్షణపై అవగాహన కల్పించారు. దత్తతకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమాల్లో ఐసిడిఎస్ సూపర్వైజర్లు, డీసీపీయూ, ఎస్‌ఏఏ మేనేజర్, చైల్డ్‌లైన్ సూపర్వైజర్లు, వైద్య అధికారులు, ఏఎన్‌ఎంలు,ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, పాఠశాల యాజమాన్యం పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page