నవంబర్ 16, 2026
TRINETHRAM NEWS
Impact of cyclone

Impact of Cyclone : గుంటూరు జిల్లా : అమరావతి: త్రినేత్రం న్యూస్ : నవంబర్ 15 ; ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈనెల18,19వ తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే 18న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా,19 న శ్రీకాకుళం, విజయనగరం, తో పాటు విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది.

అదేరోజు కాకినాడ, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తుఫాన్ కదలికల ఆధారంగా వర్షాల తీవ్రతలో మార్పు లు ఉండవచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page