
Essential Commodities Seized : గుంటూరు జిల్లా: అమరావతి : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 15 ; బియ్యం ధరల పెరుగుదలను నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. కృత్రిమ కొరత సృష్టిస్తున్నటువంటి వ్యాపారులపై నిఘా పెంచింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా 294 ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించింది.
ఈ దాడుల్లో 516 కేసులు నమోదయ్యాయి.. రూపాయలు 10.43 కోట్ల విలువైన సరుకును స్వాధీనం చేసుకున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అక్రమ నిల్వ లు, బ్లాక్ మార్కెటింగ్ ను అరికట్టేందుకు రైస్ మిల్లర్లు నిల్వల వివరాలను వారానికొకసారి తెలియజేయాలని ఆదేశించారు. నిత్యవసర ధరలను అదుపులోకి తెచ్చేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe