నవంబర్ 16, 2026
TRINETHRAM NEWS
Auctioning Sarpanch Post

Auctioning Sarpanch Post : కర్నూలు జిల్లా : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 15; దేవరకొండ మండలం, పల్లె దొడ్డి గ్రామంలో సర్పంచ్ పదవిని వేలం వేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మారెమ్మ ఆలయ నిర్మాణ నిధుల కోసం ఈ వేలం నిర్వహించారని , అయితే ఇందులో బోయం ఖాసిం రూపాయలు 32.50 లక్షలకు బిడ్ దాఖలు చేసినట్లు ఆ గ్రామస్తుల మధ్య చర్చ నడుస్తోంది.

గ్రామ పెద్దల సమక్షంలోనే వేలంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై అధికార ధ్రువీకరణ రావా ల్సి ఉంది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా జరిగిన దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page