
— తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల లంబాడిపై వివక్షత చూపుతోంది
—జనసేన పార్టీ సీనియర్ నాయకులు సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొర్ర చందు నాయక్.
Korra Chandu Naik : దేవరకొండ డివిజన్ నవంబర్ 15, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైపతి అరుణ్ కుమార్ పై చట్టరీత్య చర్యలు తీసుకోవడంలో విఫలమైందనీ యావత్ భారత దేశ గిరిజన లంబాడి బిడ్డలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డీజీపీ కార్యాలయం ముట్టడిస్తు ఉద్యమాలు చేపడతామని చందు నాయక్ అన్నారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ….. బంజారా జాతి ఆరాధ్య దైవం, సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గురించి మతి లేని మైపతి అరుణ్ కుమార్ కోట్లాది మంది బంజారాల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన సేవాలాల్ మహారాజ్‌ను కించపరిచే విధంగా మాట్లాడటం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం మైపతి అరుణ్ కుమార్ అహంకారానికి నిదర్శనమని విమర్శించారు
సేవాలాల్ మహారాజ్ గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని, బంజారా జాతి మొత్తానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని కోర్ర చందు నాయక్ డిమాండ్ చేశారు తక్షణమే క్షమాపణ చెప్పని పక్షంలో సేవలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని, మైపతి అరుణ్ కుమార్ ను ఎక్కడికి వెళ్లినా అడ్డుకుంటామని తీవ్రంగా హెచ్చరించారు నోరు అదుపు లేకుండా మాట్లాడడం సరికాదు అరుణ్ కుమార్ బంజారాల ఆత్మగౌరవంపై దాడి జరిగితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని, ఈ విషయంలో ప్రభుత్వం వెంటన్ స్పందించి తక్షణమే అరుణ్ కుమార్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కొర్ర చందు నాయక్ అన్నారు.
ఈ సమావేశంలో జనసేన నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe