
చిల్డ్రన్స్ డే సందర్భంగా టోర్నమెంట్
Badminton Tournament : కూకట్పల్లి నవంబర్ 15 త్రినేత్రం న్యూస్ : చిల్డ్రన్స్ డే సందర్భంగా హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని ఎస్ఎల్వీ ప్రో బ్యాడ్మింటన్ అకాడమీలో నిర్వహించిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో చిన్నారులు ప్రతిభ కనబరిచారు. అండర్-11, అండర్-9 విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో క్రీడాకారిణులు ఉత్సాహంగా పాల్గొని విజయాల కోసం పోటీపడ్డారు.
అండర్-11 సింగిల్స్ విభాగంలో లాసిని విజేతగా నిలిచింది. డబుల్స్ విభాగంలో లాసిని, ఫాతిమా జోడీ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా, మేధస్వి, ఆద్య జోడీ రన్నరప్‌గా నిలిచింది. అదేవిధంగా అండర్-9 డబుల్స్ విభాగంలో జెస్సికా, తోషిత జోడీ విజేతలుగా నిలవగా, అన్షిని, జస్విత జోడీ ద్వితీయ స్థానాన్ని సాధించింది.
చిన్నారుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు, వారిలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు నిర్వహించిన ఈ పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. విజేతలుగా నిలిచిన క్రీడాకారిణులను అభినందించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe