
Free Medical Camp : కుక్కట్ పల్లి నవంబర్ 15 త్రినేత్రం న్యూస్ : గౌతమ్ నగర్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరానికి బీజేపీ సీనియర్ నాయకులు కాంచి మహేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాలానగర్, చింతల్‌లోని ఆర్.ఎన్.సి. హాస్పిటల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సి. రమేష్ ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంచి మహేందర్ మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించడంలో ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు, అవసరమైన వైద్య సేవలను అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన డాక్టర్ సి. రమేష్‌తో పాటు సొసైటీ ప్రతినిధులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో రఘు బట్టా రాధేశ్యామ్, సొసైటీ అధ్యక్షులు భరత్, జనరల్ సెక్రటరీ సంతోష్, ఉపాధ్యక్షులు ఆకాష్, జాయింట్ సెక్రటరీ సుశాంత్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe