
- భర్తే హత్య చేసినట్లు సమాచారం!
Brutal Murder : త్రినేత్రం న్యూస్ : నల్లగొండ::: పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న మెహబూబ్ బి మంగళవారం దారుణ హత్యకు గురయ్యారు. జిల్లా కేంద్రంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న పోలీస్ క్వార్టర్లలో మెహబూబ్ బి నివాసం ఉంటున్నారు. అయితే మెహబూబ్ బి ను ఆమె భర్త సతీష్ గొంతునులిమి అత్యంత దారుణంగా హతమార్చినట్లు తెలుస్తుంది.
కులాంతర వివాహం చేసుకున్న వీరు గత కొన్ని రోజులుగా తరచూ గొడవలు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఇప్పటికే ఆమె భర్త సతీష్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తుంది.హత్యకు గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.సంఘటన స్థలాన్ని నల్లగొండ డిఎస్పి శివరామిరెడ్డి, సిఐ ఆదిరెడ్డి, ఎస్సైలు పరిశీలించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe