
Diwali Firecracker Accidents : త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్: దీపావళి వేడుకల్లో టపాసులు పేల్చే సమయంలో జరిగిన ప్రమాదాల కారణంగా 32 మంది కంటి గాయాలతో మెహదీపట్నంలోని ప్రభుత్వ సరోజినీదేవి కంటి ఆసుపత్రిని ఆశ్రయించారు.
వీరిలో నలుగురు చిన్నారులు, ఇద్దరు పెద్దలు కలిపి మొత్తం ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 26 మందికి వైద్యులు మందులు అందించి, తదుపరి పరీక్షల కోసం రావాలని సూచించారు.
ఈ ప్రమాదాల్లో ఒక బాధితుడు కుడి కంటిలో పూర్తిగా చూపు కోల్పోయినట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ ఇబ్రహీం మాట్లాడుతూ.. మరిన్ని కేసులు వచ్చినా చికిత్స అందించేందుకు ఆసుపత్రి సిద్ధంగా ఉందని తెలిపారు. టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ముఖ్య సూచన: వెలిగించిన టపాసులను చేతుల్లో పట్టుకోవడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలి. చిన్నారులతో టపాసులు కాల్చించేటప్పుడు పెద్దలు తప్పనిసరిగా పర్యవేక్షించాలి.
సరదా కోసం చేసే చిన్న నిర్లక్ష్యం.. జీవితాంతం చీకటిని మిగల్చకూడదు!…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe