అక్టోబర్ 31, 2026
TRINETHRAM NEWS
MLC election

– బీఆర్ఎస్‌కు మద్దతుగా నిలవాలి.. రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలకు ఎమ్మెల్సీ ఓటుతో సమాధానం చెప్పాలి
– బీఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ.

MLC Election : దేవరకొండ డివిజన్ అక్టోబర్ 30, త్రినేత్రం న్యూస్. అర్హత కలిగిన ప్రతి గ్రాడ్యుయేట్ తప్పనిసరిగా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ సూచించారు.శుక్రవారం దేవరకొండ పట్టణంలోని భవిత జూనియర్, డిగ్రీ కళాశాలలో గ్రాడ్యుయేట్లను కలిసి ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు ఎంతో విలువైనదని, యువత తమ హక్కులను కాపాడుకోవడంతో పాటు ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకగా నిలవాలని అన్నారు.రాష్ట్రంలో నిరుద్యోగులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీకి గ్రాడ్యుయేట్లు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.”మీ ఓటు మీ గొంతుక.. మీ ఓటు మీ భవిష్యత్తుకు బాట” అని పేర్కొంటూ, పట్టభద్రుల హక్కుల పరిరక్షణ కోసం అర్హులైన ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకోవాలని బొడ్డుపల్లి కృష్ణ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ మండల అధ్యక్షులు పాత్లావత్ లక్ష్మణ్, చాట్ల ప్రశాంత్, రాంబాబు, శ్రీరాములు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page