అక్టోబర్ 31, 2026
TRINETHRAM NEWS
Boddupalli Krishna

-విద్యార్థినిల ఆత్మహత్యాయత్నానికి కారకులైన ఉపాధ్యాయులను విధుల నుంచి తొలగించాలి
– ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
– అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు
–బీఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ.

Boddupalli Krishna : దేవరకొండ డివిజన్ అక్టోబర్ 30, త్రినేత్రం న్యూస్. గురుకుల పాఠశాలలను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి అని దేవరకొండ బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ కోరారు.దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినిని శుక్రవారం బీఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ పరామర్శించారు.అనంతరం ఈ ఘటనకు నిరసనగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గురుకుల పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా బొడ్డుపల్లి కృష్ణ మాట్లాడుతూ.. విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపించాలని, ఘటనకు బాధ్యులుగా తేలిన ఉపాధ్యాయులను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆర్‌సీఓ పర్యవేక్షణ లోపం, సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు.విద్యార్థుల భద్రతను పట్టించుకోకుండా ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆందోళనకరమని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యాశాఖకు పూర్తిస్థాయి మంత్రి లేకపోవడంతో విద్యావ్యవస్థపై సమర్థవంతమైన పర్యవేక్షణ కొరవడిందని విమర్శించారు.రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు తగిన భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గురుకుల విద్యావ్యవస్థకు అధిక ప్రాధాన్యతనిచ్చి విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించామని గుర్తుచేశారు.

ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి గురుకుల పాఠశాలలను క్షేత్రస్థాయిలో సందర్శించి విద్యార్థుల సమస్యలను తెలుసుకోవాలని కోరారు.ఈ ఘటనపై తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ మండల అధ్యక్షులు పాత్లావత్ లక్ష్మణ్, చాట్ల ప్రశాంత్,ముదిగొండ హరిదాస్,తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page