
Work Together : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 30 ;జీలుగుమిల్లి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలవరం డైనమిక్ శాసనసభ్యులు చిర్రి బాలరాజు ,గౌడ సంఘం నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం జీలుగుమిల్లి, పి. రాజవరం గ్రామాల్లో కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆ మండలం జెడ్పీటీసీ అభ్యర్థి కుంజా నాగమణి, జీలుగుమిల్లి ఎంపీటీసీ అభ్యర్థిని కారం సుజాత, తాటియాకులగూడెం ఎంపీటీసీ అభ్యర్థిని జాస్తి హేమ విజయానికి కూటమి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని ఆయన వాళ్లకు పిలుపునిచ్చారు. అదేవిధంగా మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా కొనసాగుతాయని అన్నారు. ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కూటమి అభ్యర్థులకు ప్రజలు తమ మద్దతు ఇవ్వాలని కోరారు.
అనంతరం గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి కూటమి అభ్యర్థుల విజయానికి మద్దతు కోరుతూ జోరుగా ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జనసేన కార్యదర్శి గెడ్డమనగు రవి, జనసేన మండల అధ్యక్షుడు పసుపులేటి రాము, రూపా సత్యనారాయణ, కోలా మధు, చిర్రి వెంకటేశ్వరరావు, చిర్రి శ్రీనివాస్, కూరం వెంకటేష్, ఉలవల శివ, నరేంద్ర, ఉలవల ముత్యం, కొప్పుల కృష్ణమోహన్, చిట్టిబొమ్మ సతీష్, కక్కిరాల మురళి, మధు, జాస్తి సత్యనారాయణ, గుడిపాటి పుల్లారావు, సూరిశెట్టి మహేష్ తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe