
ఎన్నికల నిర్వహణలో అలసత్వం వద్దు
Complete Arrangements : అరకులోయ,అక్టోబర్ 26, (త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా ఎన్నికల పరిశీలకులు రోణంకి కూర్మనాథ్, ఐఏఎస్ ఆదివారం డుంబ్రిగూడ, అరకువ్యాలీ మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు, విద్యుత్ సౌకర్యం, ఓటర్లకు కల్పించాల్సిన సదుపాయాలను పరిశీలించి, లోటుపాట్లను వెంటనే సరిచేయాలని అధికారులను ఆదేశించారు.
దివ్యాంగులు, వృద్ధ ఓటర్ల సౌకర్యార్థం ర్యాంపులు ఏర్పాటు చేయాలని, బీఎల్వోల పేర్లు, ఫోన్ నంబర్లు ప్రదర్శించాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో భద్రతను పటిష్టం చేసి, అవసరమైన చోట సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల ఏర్పాట్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో సంబంధిత ఎన్నికల, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe