
Passenger Pushes Conductor : త్రినేత్రం న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. చిల్లర విషయంలో తలెత్తిన వివాదం కారణంగా ఓ ప్రయాణికురాలు బస్సు నుంచి కండక్టర్ను బయటకు తోసేసినట్లు సమాచారం.
అశ్వాపురం మండలం మిట్టగూడెం వద్ద ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రయాణికురాలితో వాగ్వాదం చోటుచేసుకున్న క్రమంలో కండక్టర్ బస్సు నుంచి కిందపడగా, బస్సు టైర్ల కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కండక్టర్ ఆరోగ్య పరిస్థితి, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe