
Sujatha Salman Demand : అరకులోయ,అక్టోబర్ 26,(త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని సామాజిక కార్యకర్త, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు సుజాత సల్మాన్ డిమాండ్ చేశారు. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.కోటి చొప్పున పరిహారం అందించి, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలు తీవ్ర విషాదంలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి, వారికి తగిన ఆర్థిక సహాయం అందించాలని పేర్కొన్నారు.
ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టి, ఘటనకు నిర్లక్ష్యం కారణమని తేలితే బాధ్యులైన కాంట్రాక్టర్‌తో పాటు సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సుజాత సల్మాన్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు పర్యవేక్షణను పెంచి, అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రాణనష్టం జరిగిన ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి, బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe