
Seizure Black Jaggery : దేవరకొండ డివిజన్ అక్టోబర్ 25, త్రినేత్రం న్యూస్. దేవరకొండ సమీపంలోని డిండి కి వెళ్ళే మార్గంలో ఉన్న మైనంపల్లి స్టేజి వద్ద ఆదివారం నల్ల బెల్లం తరలిస్తూ ఒక వాహనం నుండి మరొకవాహనంలోకి మారుస్తుండగా ముగ్గురువ్యక్తులు రెండు వాహనాలతో పట్టుబడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాలప్రకారం
హైదరాబాద్లోని , పి & ఈ ఐ, ఎస్ టీ ఎఫ్ విభాగాలకు చెందిన బృందం (ఏ. గణపతి రెడ్డి నేతృత్వంలో), దేవరకొండ సమీపంలో, డిండి కి వెళ్లే మార్గంలో ఉన్న మైనంపల్లి గేటు వద్దకు చేరుకుంది. అక్కడ రోడ్డుకు కుడివైపున కొన్ని వాహనాలు ఆగి ఉండటాన్ని వారు గమనించారు. బృందం దగ్గరకు వెళ్లగా, ముగ్గురు వ్యక్తులు ఒక అశోక్ లేలాండ్ వాహనం నుండి స్విఫ్ట్ డిజైర్ కారులోకి సంచులను మారుస్తూ కనిపించారు.అధికారులను చూడగానే వారు పారిపోవడానికి ప్రయత్నించారు, కానీ వారిని అదుపులోకి తీసుకునీ విచారించగా . వాటిలో నల్ల బెల్లం, అక్రమ మద్యం తయారీకి ఉపయోగించే పదార్థాలు మరియు కొంత దేశీయ మద్యం ఉన్నట్లు వారు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాలప్రకారం A1 – కట్రావత్ రాజా (బాలు కుమారుడు), పెద్ద తండా, బొల్లనపల్లి, డిండి మండలం; A2 – వడ్ల్యా అశోక్, డాక్య తండా, గుండ్లపల్లి మండలం; A3 – మహమ్మద్ ఇనాయతుల్లా, ఫలక్నుమా, చార్మినార్. అని ,స్వాధీనం చేసుకున్న వస్తువులు: 1) నల్ల బెల్లం: 1,830 కిలోలు, 2) పటిక (Alum): 160 కిలోలు, 3) దేశీయ మద్యం: 05 లీటర్లు. వాహనాల వివరాలు:
- మారుతి స్విఫ్ట్ డిజైర్, వాహన సంఖ్య: TS 05 EM 8611
- అశోక్ లేలాండ్, వాహన సంఖ్య: TG 12 U 2890
మొబైల్ పరికరాల వివరాలు:
- పరికరం: Vivo V40e
- పరికరం: Vivo V30
ఈ ఘటనపై దేవరకొండ ఎస్హెచ్ఓ (SHO) కేసు నమోదు చేశారు.
ఈ నేరంలో ఇంకా ఎవరెవరు ప్రమేయం కలిగి ఉన్నారో తెలుసుకోవడానికి ప్రస్తుతం విచారణ కొనసాగుతోందనీ తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe