అక్టోబర్ 26, 2026
TRINETHRAM NEWS
Final list of candidates

Final List of Candidates : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 25 ; రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 9,829 మండల పరిషత్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల్లో పోటీ చేసేందుకు మొత్తం46,045 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

అయితే మరోవైపు 659 జిల్లా పరిషత్ స్థానాలకు సంబంధించి 4,770 మంది నామినేషన్ లు చెల్లుబాటు అయినట్లు అధికారులు వెల్లడించారు. తుది జాబితా విడుదలతో ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తి అయిందని పేర్కొన్నారు. ఇక ఆయా స్థానాల్లో అభ్యర్థుల మధ్య పోటీ నెలకొననుంది. ఎన్నికల నిర్వహణకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page