అక్టోబర్ 25, 2026
TRINETHRAM NEWS
YSRCP is lie

YSRCP is lie : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 25 ; జీలుగుమిల్లి మండలం, తాటి యా కుల గూడెం గ్రామపంచాయతీలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో కూటమి నాయకులు మాట్లాడుతూ, గత వైసిపి ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి అందాయని స్పష్టం చేశారు. అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు రాజకీయ పార్టీలలో చేరికల గురించి వివరించారు.

అయితే నేలటూరి మోహన్ కూడా మాట్లాడుతూ,40 ఏళ్లుగా సిపిఎం పార్టీలో ముఖ్య నాయకుడిగా పనిచేసినని అన్నారు. జిల్లా మరియు నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాలలో ప్రజా సమస్యల పరిష్కారానికి వెనకడుగు వేయకుండా ముందుండి నడిపించాను అని తెలిపారు. చదువుకునే రోజుల్లో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నాయకత్వం వహించానని పేర్కొన్నారు. నిరుపేదలకు ఇంటి స్థలాలు, ఇళ్ళు, రేషన్ కార్డులు, పింఛన్లు, భూ సమస్యలకు మరెన్నో తదితర అంశాలపై కృషి చేశానని అన్నారు. ప్రజల కోసం అన్యాయంగా తనను జైల్లో పెట్టిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.

తన ఎదుగుదల పట్ల కొంతమంది స్వార్ధపరుల వల్ల పార్టీకి దూరంగా ఉన్నానని వెల్లడించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , జనసేన నేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీని స్థాపించిన తరువాత 14 ఏళ్లుగా ఆయన కష్టాన్ని ఇష్టంగా భావించి ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు దేశంలో ఒక గొప్ప నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడని సూచించారు. దేశంలో ప్రధాన మోదీ, రాష్ట్రంలో కూటమి డబల్ ఇంజిన్ సర్కార్ చీకటిలో ఉన్న రాష్ట్రాన్ని వెలుగులోకి తీసుకొచ్చిందని క్లుప్తంగా చెప్పారు. డైనమిక్ శాసనసభ్యులు చిర్రి బాలరాజు, కూటమి నాయకులు , ప్రజలు మళ్లీ మీరు ఇదివరకు ఎలాగా నాయకత్వం వహించారో ఇప్పుడు అంతకంటే ఎక్కువ నాయకత్వం చేయాలని వాళ్లు కోరగా జనసేన పార్టీలో చేరినప్పటి నుండి మోహన్ తన వంతు బాధ్యతను వ్యవహారిస్తున్నానని చెప్పారు.

వైసిపి అబద్దాలను తిప్పి కొట్టారు. వాళ్ల పార్టీ వాళ్లకు జనసేన పార్టీ కండు వాలుకప్పి జనసేన పార్టీ వాళ్లు వైసీపీలో చేరినట్లుగా క్రెడిట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గత వైసిపి పరిపాలన బాగుంటే 151 సీట్లకు 11 సీట్లు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. ఎమ్మెల్యేకు మరియు పార్టీకి అండగా ఉండి సంక్షేమం, అభివృద్ధిలో ఆరు అడుగుల బుల్లెట్ దూసుకెళ్తామని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీలు సమన్వయంగా ముందుకెళతామని సంతోషం వ్యక్తం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page