
Review Meeting : డిండి (గుండ్లపల్లి) సెప్టెంబర్ 26, త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో నీ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పి కమలాకర్ రెడ్డి మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన ఎం పి డీ ఓ నర్రా వేజన ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్, గుండ్లపల్లి కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సమావేశంలో గొరటి జంగయ్య ఎం పి ఓ, ఏ పి ఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే మండలంలోని అన్ని శాఖలకు చెందిన అధికారులు, అన్ని గ్రామ పంచాయతీల గౌరవ సర్పంచులు మరియు అన్ని గ్రామ పంచాయతీల పంచాయతీ కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మండల పరిధిలోని వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామ పంచాయతీల అభివృద్ధి మరియు ప్రజలకు అందుతున్న సేవలపై సమీక్ష నిర్వహించడం జరిగింది.

అధికారిక సమావేశాలు మరియు ఆఫీస్ టేబుల్ కోసం అత్యంత ఆకర్షణీయమైన డెస్క్ ఆర్గనైజర్!