సెప్టెంబర్ 25, 2026
TRINETHRAM NEWS
Praneeth Reddy Balapur Laddu

Praneeth Reddy Balapur Laddu : త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్‌ నగరం లోని బాలాపూర్ లో గణేశుడి లడ్డూ వేలం పూర్తయింది, ఈసారి లడ్డు రికార్డు ధర పలికింది. వనస్థలిపు రంలోని సాహెబ్ నగర్ కు చెందిన సామ ప్రణీత్ రెడ్డి, సొంతం చేసుకున్నారు.

వినాయక చవితి ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే బాలాపూర్ లడ్డూకు ఈసారి మరింత డిమాండ్ పెరిగింది. ఏటా నిర్వహించే లడ్డూ వేలంలో ఈసారి కంపెనీలు కూడా పోటీకి దిగడం ఆసక్తికరంగా మారింది. 32 ఏళ్లుగా వ్యక్తిగతంగా కొనసా గుతున్న రిజిస్ట్రేషన్లు, వేలంపాటలో తొలిసారిగా కంపెనీల భాగస్వామ్యం చర్చనీయాంశంగా మారింది. అయితే తాజగా బాలాపూర్‌ లడ్డును సామ ప్రణిత్ రెడ్డి రూ.39 లక్షలకు దక్కించుకున్నారు.

బాలాపూర్ లడ్డూ వేలం కోసం ఈసారి మొత్తం 9 మంది దరఖాస్తుదారులు ముందుకొచ్చారు. వీరిలో ఏకంగా ఐదు కంపెనీలు ఉండటం విశేషం. ఇప్పటివరకు వ్యక్తులు మాత్రమే లడ్డూ వేలంలో పాల్గొంటూ వచ్చారు. అయితే ఈసారి కంపెనీలు కూడా పోటీకి రావడంతో లడ్డూ వేలంపై ఆసక్తి మరింత పెరిగింది. …

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page