సెప్టెంబర్ 25, 2026
TRINETHRAM NEWS
Kharif Paddy

Kharif Paddy : యన్ టి ఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్: సెప్టెంబర్ 25 ; జిల్లా కేంద్రమైన విజయవాడలో ఖరీఫ్ ధాన్యం సేకరణ పై పౌరసరఫరాల శాఖ రాష్ట్రస్థాయి వర్కింగ్ షాపులో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , 24 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని అన్నారు. అయితే నవంబర్ ఒకటవ తేదీ నుంచి ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రారంభిస్తామని తెలిపారు.

ఈ సీజన్ లో 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు 2,619 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులకు ఈ ఏడాది రవాణా ఖర్చులు కూడా చెల్లించేలా ప్రణాళిక రూపొందించినట్లు ఆయన వెల్లడించారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page