సెప్టెంబర్ 25, 2026
TRINETHRAM NEWS
Police Open Fire

Police Open Fire : త్రినేత్రం న్యూస్ : కడప జిల్లా దువ్వూరు మండలం జగనన్న కాలనీలో మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ జాకీర్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. జాకీర్‌పై చాపాడు పోలీస్‌స్టేషన్‌లో హత్యాయత్నం కేసు ఉన్నట్లు సమాచారం.

దువ్వూరు సమీపంలో జాకీర్ ఉన్నాడన్న సమాచారంతో పోలీసులు అర్ధరాత్రి సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో జాకీర్ పోలీసులపై తిరగబడటంతో అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం. కాల్పుల్లో గాయపడిన జాకీర్‌ను చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page