సెప్టెంబర్ 25, 2026
TRINETHRAM NEWS
Farmers Complete Their Registration

సెప్టెంబర్ 30 చివరి తేదీ

—కొత్తగా పట్టా పొందిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

ఏ ఈ ఓ :- సాయి తేజ.

Farmers Complete Their Registration : డిండి (గుండ్లపల్లి) సెప్టెంబర్ 23, త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లాడిండి మండల పరిధిలోని వావిల్ కోల్, మరియు రహ్మంతాపూర్ గ్రామాలలో బుధవారం ఫార్మర్ రిజిస్ట్రేషన్ గురించి రైతులకు అవగాహన కలిగించారు.
ఈ సందర్భంగా ఏ ఈ ఓ మాట్లాడుతూ…. రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, కొత్తగా పట్టా అయిన వారు కూడా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని తెలిపారు. ఇప్పటికే రైతు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోని వారికి యూరియా బుక్ అవ్వట్లేదని. భవిష్యత్తులో వరి, పత్తి, కంది పంటలను మద్దతు ధరకు అమ్ముకోలేరని భవిష్యత్తులో బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొందడానికి కూడా ఈ ఫార్మర్ ఐడి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు మరియు సబ్సిడీలు ఇతర వ్యవసాయ సంబంధిత సేవలకు ఫార్మర్ ఐడి తప్పనిసరి అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page