
- ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి
- తీదేడు గ్రామ సర్పంచ్
Initiative Launched : చింతపల్లి సెప్టెంబర్ 23, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలం తీదేడు గ్రామంలో రామాలయం వద్ద నూతన ధ్వజ స్తంభం ఏర్పాటు చేయడానికి గ్రామ సర్పంచ్ స్వప్న శేఖర్ రెడ్డి, గ్రామ ప్రజలతో కలిసి శ్రీకారం చుట్టారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ..
భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధికి మరింత ప్రాధాన్యత సంతరించుకుందని ఆలయ ఆధ్యాత్మిక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని నూతన ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు.గ్రామంలో దేవాలయాల అభివృద్ధితో పాటు భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు.నూతన ధ్వజస్తంభం తయారీ పనులు ప్రారంభం కావడంతో గ్రామ ప్రజలు,భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తిరుమణి పాపయ్య,మర్రు శ్రీనివాస రావు,పల్లగుట్ట రాములు,సోనగంటి కృష్ణమాచారి,మొరుపోజు లక్ష్మిపతి,మొరుపోజు రాజు,మునగాల రవి,సోనగంటి అనంతచారి,మునగాల అశోక్,వలమోని వెంకటయ్య,బృంగి యాదగిరి,నాగసాని ఈశ్వరయ్య,భక్తులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe