సెప్టెంబర్ 25, 2026
TRINETHRAM NEWS
SGF sports events

SGF Sports Events : డిండి (గుండ్లపల్లి) సెప్టెంబర్ 22 ,త్రినేత్రం న్యూస్. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే దేవరకొండ నియోజకవర్గస్థాయి క్రీడలకు డిండి మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ మైదానాన్ని సిద్ధం చేస్తున్నారు .ఈనెల 24 ,25 తేదీలలో డివిజన్ లోని ఎనిమిది మండలాల నుంచి అండర్ 14,అండర్ 17 బాల బాలికలకు కబడ్డీ, వాలీబాల్ ,కోకో, క్రీడలలో పోటీలు నిర్వహించి జిల్లా స్థాయికి క్రీడా జట్లను ఎంపిక చేస్తామని క్రీడల కన్వీనర్ ఐ జయమ్మ పిడి తెలిపారు.
రెండు రోజులపాటు నిర్వహించబడే క్రీడా పోటీలకు పోటీలలో పాల్గొనే క్రీడాకారులు క్రమశిక్షణతో అంపైర్ల నిర్ణయాన్ని కట్టుబడి విజయవంతం చేయాలని క్రీడాకారులకు ,ఫిజికల్ డైరెక్టర్లకు వివిధ పాఠశాల ఉపాధ్యాయులకు మండల పగిడిపాటి నరసింహ విద్యాధికారి విజ్ఞప్తి చేశారు. డిండి హైస్కూల్ గ్రౌండ్లో స్థానిక సర్పంచ్ నల్లగంతుల రవి తన చొరవతో క్రీడా మైదానాన్ని సిద్ధం చేయిస్తున్నారు.క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, భోజన సదుపాయాలు ఇతర ఏర్పాట్లను ,స్థానిక సర్పంచి రవితో పాటు ఫిజికల్ డైరెక్టర్లు జై చంద్రయ్య, ఇద్దయ్య ,రంగా నాయక్, తస్లీమ్ ,యాదయ్య ,నవనీత ,శ్రీనివాస్ తదితరు లు పాల్గొని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page