
ముద్దాల తిరుపతిరావు (అను) జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి చెల్లుబోయిన
Birthday Celebrations : త్రినేత్రం న్యూస్, వేణుగోపాలకృష్ణ.. కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని వెల్లడి రాజమహేంద్రవరం: పుట్టినరోజు వేడుకలను సామాజిక సేవా కార్యక్రమాలతో నిర్వహిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్, యువ కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు ముద్దాల తిరుపతిరావు (అను) ఆదర్శంగా నిలిచారు. పేదలు, వృద్ధులు, వికలాంగులకు భోజనాలు, పండ్ల పంపిణీ చేపట్టారు.
కార్యకర్తలకు అండగా జగన్.. కష్టపడిన వారికి గుర్తింపు: వేణు… రాజమహేంద్రవరం రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పాల్గొని కేక్ కట్ చేసి తిరుపతిరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యకర్తలకు అండగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారని, కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందని వేణు పేర్కొన్నారు.
పుట్టినరోజు అంటే సేవకు వేదిక కావాలి: గొందేసి… రాష్ట్ర కార్యదర్శి, ప్రముఖ న్యాయవాది గొందేసి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలను కేవలం వినోదానికే పరిమితం చేయకుండా, పేదలు, వృద్ధులు, వికలాంగులకు సేవ చేయడం అభినందనీయమన్నారు. యువత కూడా సామాజిక సేవా కార్యక్రమాల వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కాపు, బీసీ, ఎస్సీ, కార్మిక నాయకులు పాల్గొని వికలాంగులకు, వృద్ధులకు భోజనాలు పంపిణీ చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe