సెప్టెంబర్ 11, 2026
TRINETHRAM NEWS
Enamalla Naveen

Enamalla Naveen : డిండి గుండ్లపల్లి సెప్టెంబర్ 11,త్రినేత్రం న్యూస్. అఖిలభారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభ యాదగిరిగుట్టలో మొదటిరోజు బహిరంగ సభ జరగగా తరువాత రెండు రోజులపాటు జరిగిన ప్రతినిధుల మహాసభలో అఖిల భారత యువజన సమాఖ్య తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎనమల్ల నవీన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) గ్రామ,మండల,జిల్లా,రాష్ట్ర నాయకత్వానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానుఅని అన్నారు.నాపై నమ్మకం ఉంచి నాకు ఈ అవకాశం కల్పించిన మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలబెట్టుకుంటానని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్)ను గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సంఘం బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తానని కేంద్ర కమిటీ మరియు రాష్ట్ర కమిటీ ఇచ్చే ప్రతి కార్యచరణను తూచా తప్పక పాటిస్తానని విద్య వైద్య ఉపాధి హక్కుల సాధనకై నిత్యం పోరాడుతానని యువత సమస్యలపై నిత్యం ప్రశ్నిస్తానని నవీన్ తెలిపారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page