సెప్టెంబర్ 11, 2026
TRINETHRAM NEWS
Yekula Anita meets Caroline

Yekula Anita meets Caroline : దేవరకొండ, సెప్టెంబర్ 11 , త్రినేత్రం న్యూస్ . దేవరకొండ రెవెన్యూ డివిజన్ నూతన సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కరోలిన్ చింగ్ తియాన్ మావి ని జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు యేకుల అనిత సురేష్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
దేవరకొండలోని రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో నూతన సబ్ కలెక్టర్‌ను కలసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని ప్రజా సమస్యలను సబ్ కలెక్టర్‌తో క్షేత్రస్థాయి విషయాలను చర్చించారు. డివిజన్‌లో ప్రజ ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక పాలనలో ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలని కోరారు.
దీనికి సబ్ కలెక్టర్ కరోలిన్ చింగ్ తియాన్ మావి స్పందిస్తూ, డివిజన్ అభివృద్ధికి, ప్రజా సమస్యల త్వరితగతిన పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన అందిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీపిసిసి ఎస్సీ విభాగం రాష్ట్ర జనరల్ సెక్రెటరీ యేకుల రాజారావు, చేపూరి మురళి పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page