
Truth has Triumphed : గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంఇంచార్జి. పెనుమూరు. సెప్టెంబర్ 9.(త్రినేత్రం న్యూస్ ). “53 రోజుల చీకటి అధ్యాయానికి గుర్తుగా.. పెనుమూరులో కొవ్వొత్తుల వెలుగులో బ్లాక్ డే”పాటించిన పెనుమూరు మండలం టీడీపీ అధ్యక్షులు రుద్రయ్య నాయుడు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని అక్రమ కేసులో అరెస్టు చేసి 53రోజులు క్ డేగా పాటించారు
ఈ సందర్భంగా జీడీనెల్లూరు నియోజకవర్గం, పెనుమూరు మండలంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పెద్దినేని రుద్రయ్య నాయుడు ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రుద్రయ్య నాయుడు మాట్లాడుతూ, రాజకీయ కక్ష సాధింపులతో కూడిన అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిపై తప్పుడు కేసులు బనాయించి, ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు
అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజల గొంతును నొక్కాలని ప్రయత్నించినప్పటికీ, చివరికి సత్యం, న్యాయం మాత్రమే గెలిచాయని అన్నారు. చంద్రబాబు నాయుడు గారిపై జరిగిన అక్రమ అరెస్టును ప్రజలు ఎన్నటికీ మరువరని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe