
—ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్.
Porubata : దేవరకొండ డివిజన్ సెప్టెంబర్ 09, త్రినేత్రం న్యూస్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల దగా పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ పిలుపు మేరకు చేపట్టిన “వారం రోజుల పోరుబాట” కార్యక్రమాలను విజయవంతం చేసిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, యువత, మహిళలు మరియు ప్రజలందరికీ దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..తనపై ఉన్న గౌరవం, అభిమానంతో తమ వ్యక్తిగత పనులను సైతం పక్కనపెట్టి పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అహర్నిశలు శ్రమించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, ఎన్నికల హామీల అమలులో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన పోరుబాటకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు.
భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ప్రజా సమస్యలపై తన పోరాటం ఎప్పటికీ ఆగదని, ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ప్రజల హక్కులు, సంక్షేమం కోసం బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరింత బలమైన పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe