సెప్టెంబర్ 3, 2026
TRINETHRAM NEWS
Arrests Not Solution

Arrests Not Solution : అరకు లోయ సెప్టెంబర్ 2, (త్రినేత్రం న్యూస్): విశాఖపట్నం మారికవలస స్కూల్ వ్యవహారంలో సమస్యను చర్చల ద్వారా పరిష్కరించకుండా గిరిజన నాయకులను అరెస్టు చేయడం దారుణమని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు సుజాత సల్మాన్ విమర్శించారు. గిరిజనుల సమస్యలను ప్రభుత్వం వినాలని, పోలీసు బలంతో వారి గొంతును అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు.
అరెస్టులు సమస్యకు పరిష్కారం కాదని, స్థానిక గిరిజనులు, తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు, నాయకులతో చర్చించి మారికవలస స్కూల్ సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన గిరిజన నాయకులను వెంటనే విడుదల చేసి, ప్రభుత్వం బహిరంగ చర్చకు రావాలని సుజాత సల్మాన్ కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page