సెప్టెంబర్ 21, 2026
TRINETHRAM NEWS
RTC Loot

బీఆర్‌ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ.

RTC Loot : దేవరకొండ డివిజన్ ఆగస్టు 31, త్రినేత్రం న్యూస్. రాఖీ పండుగ పేరుతో తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులపై అదనపు భారం మోపుతూ దోపిడీకి పాల్పడుతోందని బీఆర్‌ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ ఆరోపించారు. హైదరాబాద్‌ నుంచి దేవరకొండకు సాధారణ బస్సు ఛార్జీ రూ.150 ఉండగా, రాఖీ పండుగ సందర్భంగా ‘స్పెషల్‌ బస్‌’ పేరుతో రూ.220కు పెంచడం దారుణమన్నారు.
ఈ సందర్భంగా బొడ్డుపల్లి కృష్ణ మాట్లాడుతూ.. పండుగల సమయంలో ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఆర్టీసీ ఛార్జీలను పెంచడం సరికాదన్నారు. ఒకవైపు పేద ప్రజలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ, మరోవైపు ఇతర మార్గాల్లో ప్రజలపై అదనపు ఆర్థిక భారం మోపుతోందని విమర్శించారు

.రాఖీ పండుగ ముగిసి రెండు రోజులు గడిచినప్పటికీ ‘స్పెషల్‌ బస్‌’ పేరుతో అధిక ఛార్జీలు వసూలు చేయడం దారుణమన్నారు. వెంటనే అధిక ఛార్జీల వసూళ్లను నిలిపివేసి, ప్రయాణికులపై జరుగుతున్న ఆర్టీసీ దోపిడీని అరికట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page