
Telugu Language Day : దేవరకొండ డివిజన్ ఆగష్టు 29, త్రినేత్రం న్యూస్. దేవరకొండ లోని మునగాల కొండల్ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్), దేవరకొండలో తెలుగు విభాగం నుండి కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రామావత్ రవి ఆధ్వర్యంలో గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా “తెలుగు భాషా దినోత్సవం” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపల్ తెలుగు విభాగాధిపతి జి.కోటయ్య మాట్లాడుతూ తెలుగు భాష అనేది కేవలం భావాన్ని వ్యక్తపరిచేది మాత్రమే కాదని అది మన చరిత్ర, సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, మన తల్లిదండ్రుల జ్ఞాపకాలు, తెలుగు నేల మట్టి వాసన ఇలా అన్నింటితో పెనవేసుకొని ఉంటుందని తెలిపారు. మన మూలాలను మర్చిపోకుండా మన భాషను మనం కాపాడుకుంటూ ఇతర భాషలలో జ్ఞానాన్ని పొందాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ కోఆర్డినేటర్ సి. లింగమయ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ జి. లింగారెడ్డి, నాగేందర్, ఎ.శ్రీను, శివకృష్ణ, సిహెచ్.శ్రీనివాస్, నర్మదా దేవి తదితర అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe