సెప్టెంబర్ 7, 2026
TRINETHRAM NEWS
Enrollment Drive

Enrollment Drive : దేవరకొండ డివిజన్ ఆగష్టు 20, త్రినేత్రం న్యూస్. దేవరకొండలో గల మునగాల కొండలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), లో ఎన్ సి సి విభాగం ఆధ్వర్యంలో ” 2026-27 విద్యా సంవత్సర విద్యార్థులకు ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామావత్ రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నల్గొండ 31 బెటాలియన్ పి ఐ స్టాప్ విద్యార్థులకు ఫిజికల్ టెస్ట్ మరియు మెడికల్ టెస్ట్ తో పాటు రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ నిర్వహించి మొత్తం ప్రథమ సంవత్సర క్యాడెడ్స్ ని 22 మందిని ఎంపిక చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ మరియు ఎన్సిసి సిటిఓ జికోటయ్య,సుబేదార్ కొమ్ము మల్లయ్య, హవల్దార్ మల్కప్ప కట్టి, అకాడమిక్ కోఆర్డినేటర్ సి.లింగమయ్య, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ జి. లింగారెడ్డి, డా„ కె.రేణుక, శివకృష్ణ, మధు, తదితర అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు ఎన్సిసి క్యాడెట్లు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page