
Cricket League Tournament : దేవరకొండ డివిజన్ ఆగష్టు 28, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణం లోని ఎం కే ఆర్ క్రికెట్ మైదానంలో దేవరకొండ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ ను బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ భీల్యానాయక్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగిస్తాయని, క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత నాయకత్వ లక్షణాలను పెంపొందింస్థాయి అని . క్రికెట్ లోనే ఆల్ రౌండ్ కాదు … నిజ జీవితంలో కూడా యువత ఆల్ రౌండ్ లాగా ఎదగాలని అన్నారు చదువులోనైనా, ఆటలోనైనా , ఉద్యోగం లోనైనా సాధన అవసరం అని క్రీడాకారులు స్నేహపూర్వకమైన వాతావరణంలో ఉత్సాహంగా టోర్నమెంట్ లో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ టోర్నమెంట్లో గెలుపొందిన మొదటి విజేతకు తన తరుపున 25000/ రుపాయలు ఇస్థున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమం లో కేతావత్ హరిలాల్ నాయక్ , యండి ఇలియాస్ పటేల్ , నిర్వాహకులు అఖిల్ , యండి పాషా, ముత్తాఫీ, ఉమర్ , నేనావత్ నాగార్జున నాయక్ , పెద్ది రాజు , చంటి , వినయ్ , సాయిరాం , ముజ్జు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe