ఆగస్ట్ 29, 2026
TRINETHRAM NEWS
Awareness Voter Revision

బీఆర్ఎస్ నాయకులు ఉలుపాల శేఖర్ రెడ్డి

Awareness Voter Revision : చింత పల్లి ఆగష్టు 27, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలం తీదేడు గ్రామంలో ఓటర్ సవరణ ఫేజ్-2 కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఉప సర్పంచ్ ఉలుపాల శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఓటర్లకు సంబంధించిన వివరాలలో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే వాటిని సరిచేసుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు సక్రమంగా నమోదై ఉందో లేదో పరిశీలించుకోవాలని సూచించారు.ఓటర్ సవరణ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, అవసరమైన పత్రాలతో సవరణలు చేసుకునే విధానాన్ని ఆయన వివరించారు.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బొడ్డు పార్వతమ్మ యాదగిరి, మాదగోని కృష్ణ గౌడ్,గ్రామస్తులు వీరమల్ల జగదీష్,దాసరి తిరుపతయ్య,ఉడుత పెద్ద వెంకటయ్య,నేలపట్ల అంజయ్య, జూనియర్ రజిత, గ్రామ పాలన అధికారి యాదయ్య,బి.ఎల్.ఓ లు చింతకుంట్ల అంజమ్మ, గంటెల చంద్రయ్య,గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page