
Former MLA : దేవరకొండ డివిజన్ ఆగష్టు 27, త్రినేత్రం న్యూస్. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కడారి అంజయ్య యాదవ్ కుమారుడు సాయిరామ్ యాదవ్–మౌనికల వివాహ వేడుకలు హైదరాబాద్ లోని శ్రీమంత్ర కన్వెన్షన్ హాల్లో ఘనంగా జరిగాయి.
ఈ వివాహ వేడుకలకు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, వారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా వధూవరుల కుటుంబ సభ్యులకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి, తోటకూరిపరమేష్,
సర్పంచులు రైనబోయిన శ్రీను, కావటి వెంకటేష్, పంది హరికృష్ణ, షేక్ ఇస్మాయిల్, సీమర్ల శ్రీను,నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe