ఆగస్ట్ 29, 2026
TRINETHRAM NEWS
Pochamma Bonalu

Pochamma Bonalu : డిండి(గుండ్లపల్లి) ఆగస్టు 26, త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని డిండి మండల కేంద్రంలో బుధవారం పోచమ్మ బోనాలను ఘనంగానిర్వహించారు .
ఈ పండుగను పురస్కరించుకొని స్థానిక కోట మైసమ్మ వద్ద భక్తులు మొక్కులు చెల్లించుకుని, స్థానిక బొడ్రాయి వద్దకు డప్పు వాయిద్యాలతో గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో ఊరేగింపుగా బొడ్రాయి వద్దకు చేరుకొని, అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి, అక్కడ నుంచి డీజే వాయిద్యాలతో, డప్పులతో, పోతురాజుల విన్యాసాలతో గ్రామ పురవీధుల గుండా బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి పోచమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యము సమర్పించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ నల్లగంతుల రవి, ఉపసర్పంచ్ కౌసర్ రషీద్, వార్డు సభ్యులు గుర్రం సురేష్ ,దివ్య ప్రవీణ్ రెడ్డి, అమృత్ ,మేకల కాశన్న, తుమ్మల లక్ష్మారెడ్డి, నూకం వెంకటేష్ ,జూలూరు వెంకటేష్ ,హనుమాండ్ల కేశవులు, పోలా వెంకటేష్, ఎలకుర్తి మల్లేష్, కాయితి పర్వత్ రెడ్డి, ఎంఏ కలీం, మాకం సైదులు, బల్మూరి రాజు, వంగాల బాల్రెడ్డి, నల్లగంతుల వెంకటయ్య, మాడుగుల జంగయ్య తుమ్మల దామోదర్ రెడ్డి తో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు, పురుషులు బాలబాలికలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్థానిక ఎస్సై బాలకృష్ణ తన సిబ్బందితో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు నిర్వహించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page