
Teej Celebrations : దేవరకొండ డివిజన్ ఆగస్టు 26, త్రినేత్రం న్యూస్. గిరిజన సంప్రదాయ పండుగ తీజ్ ఉత్సవాలలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బీల్యా నాయక్ పాల్గొని ప్రకృతి దేవతకు పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కేతావత్ బీల్యా నాయక్ మాట్లాడుతూ గిరిజన యువతులు,యువకులు ప్రకృతినే దైవంగా భావించి పుట్ట మట్టి తీసుకొచ్చి అందులో విత్తనాలు వేసి మొలకలు వచ్చే వరకు 9రోజులపాటు నిష్టతో పూజలు చేసి భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేస్తే కోరుకున్న కోరికలు తీరుతాయని నమ్ముతారని ఆ నమ్మకాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారని అన్నారు.
ఇంతటి పవిత్ర పూజా కార్యక్రమంలో పాల్గొనడం సంతోషం కలిగించిందని అన్నారు. తీజ్ పండుగ సందర్భంగా గిరిజన సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు నేనావత్ కిషన్ నాయక్ తో పాటు గిరిజన సంఘాల నాయకులు గిరిజన యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe