
మహిళలకు టైలరింగ్ సర్టిఫికెట్ల పంపిణీ.
ఆర్టీఐ ఆక్టివిస్ట్ సొసైటీ (RTIAS) రాష్ట్ర అధ్యక్షులు డా,, కొర్ర. కిషన్ నాయక్ .
Korra Kishan Naik : దేవరకొండ డివిజన్ ఆగస్టు 25, త్రినేత్రం న్యూస్. విలేజ్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు టైలరింగ్ సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా RTIAS రాష్ట్ర అధ్యక్షులు డా,,కొర్ర కిషన్ నాయక్ హాజరై, శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు చేరిపల్లి భార్గవి, బెల్లి శంకరమ్మ అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి మాట్లాడుతూ.. మహిళలు స్వయం ఉపాధి రంగాల్లో నైపుణ్యం సాధించి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో భాషా చౌహన్, జి. నిహారిక, ఎన్. శాంతి, కె. కవిత తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe