ఆగస్ట్ 23, 2026
TRINETHRAM NEWS
Ramavath Ravindra

దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్

Ramavath Ravindra : చందంపేట – ఆగష్టు 23, త్రినేత్రం న్యూస్. ప్రతి ఒక్కరూ మహాలక్ష్మమ్మ తల్లి అనుగ్రహం పొందాలని దేవరకొండ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ ఇంచార్జి రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం చందంపేట మండలం గువ్వలగుట్ట గ్రామంలో నిర్వహించిన మహాలక్ష్మమ్మ పండుగ సందర్భంగా రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….మహాలక్ష్మమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో జీవించాలని ఆకాంక్షించారు.ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో పండుగను నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు.గ్రామంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరి కుటుంబాల్లో సుఖశాంతులు నెలకొనాలని మహాలక్ష్మమ్మ తల్లిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య,రమావత్ మోహన్ కృష్ణ, కేతావత్ శంకర్ నాయక్,రమావత్ రాజా, రమావత్ బాలు, వడత్య బాలు,పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page