
Chirla Jaggi Reddy : త్రినేత్రం న్యూస్, కొత్తపేట, ఆగస్టు 18: అక్రమ కేసులు బనాయించి రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్కు పంపిన ఆలమూరు మండల వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సర్పంచ్ తమ్మన శ్రీనివాస్ కుటుంబ సభ్యులను డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పరామర్శించారు. కొత్తపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులతో కలిసి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ అన్యాయాలను ప్రశ్నించే వారిని అక్రమ కేసులతో భయపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. అయితే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎలాంటి కష్టాలు ఎదురైనా రెట్టించిన ఉత్సాహంతో ప్రజల కోసం పోరాడతారని, ఎవరూ భయపడబోరని అన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పేర్కొన్నారు.
తమ్మన శ్రీనివాస్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తమ్మన శ్రీనివాస్ భార్య, ఆలమూరు మార్కెటింగ్ కమిటీ మాజీ అధ్యక్షురాలు తమ్మన సుబ్బలక్ష్మి, వైఎస్సార్సీపీ రాజమండ్రి రూరల్ మాజీ కోఆర్డినేటర్, రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, డేవిడ్, చల్లా ప్రభాకర్ తదితర నాయకులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe