ఆగస్ట్ 8, 2026
TRINETHRAM NEWS
YCP High-Handedness

YCP High-Handedness : ఎన్టీఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 08 ; జిల్లా కేంద్రమైన విజయవాడ సెంట్రల్ డైనమిక్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ , వైసీపీ పై మండిపడ్డారు. డీఎస్సీ పేరుతో వైసిపి అరాచకానికి పాల్పడుతోందని అన్నారు.
మంత్రి నారా లోకేష్ చర్చకు సిద్ధమని ప్రకటించిన గాని వైసిపి నాయకులు ముందుకు రావడంలేదని విమర్శించారు. బ్రిడ్జ్ ఆటను పేకాటతో పోల్చి డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందినటువంటి ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అయితే గత వైసిపి పాలనలో యువత భవిష్యత్తుతో ఆడుకున్నారని , మెగా డీఎస్సీ జరగకుండా 220 కేసులు వేసిందని , కోర్టు వాటిని తిరస్కరించిందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి సూపర్ సిక్స్ పథకాలలో అమలు చేసినటువంటివి ప్రతి ఒక్కటి అందాయని స్పష్టం చేశారు. వైసీపీని ప్రజలు అధికారంలోకి రానివ్వరని గుర్తు చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page