సెప్టెంబర్ 3, 2026
TRINETHRAM NEWS
DSC Teachers Rally

DSC Teachers Rally : కర్నూలు జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 08 ; రాష్ట్రంలో 2025 వ సంవత్సరం డీఎస్సీలో అక్రమాలు జరిగాయని సిబిఐ విచారణ చేపట్టాలని, వైసిపి నేత జగన్ మరియు ఆ పార్టీ నేతలు డిమాండ్ చేయడం తెలిసిందే. అయితే దీనికి వ్యతిరేకంగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులను పొందిన అభ్యర్థులు కడప, అనంతపురం నుంచి కర్నూలుకు భారీ ఎత్తున తరలివచ్చారు.

వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తుందని ప్లకార్డులు ప్రదర్శించారు. కొండారెడ్డి బురుజు పైకి వెక్కి తమ కష్టాన్ని అవమానించొద్దంటూ నినాదాలు చేశారు. వైసిపి ఎప్పటికీ అధికారంలోకి రాదని వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page